‘రుద్రమదేవి’ వీడియో సాంగ్‌

కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 9 న విడుదల అవుతోంది. చిత్రంలోని ‘ఔనా నీవేనా..’ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు.

వివాదంలో ‘బ్రూస్ లీ’ టైటిల్ !!

రామ్ చరణ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ’ తమిళంలోనూ అదే రోజు ‘బ్రూస్ లీ 2′ టైటిల్ తో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ టైటిల్ వివాదంలో పడింది. తమిళంలో ఇదే టైటిల్ తో సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘బ్రూస్ లీ’ కూడా వస్తోంది. ఇందులోనూ కృతి కర్భందే హీరోయిన్. దాంతో ఇప్పుడు వివాదం మొదలైంది. ఈ టైటిల్ తమ చిత్రానికి డైరక్ట్ గా పెద్ద దెబ్బకొట్టినట్లే…

థాయ్‌లో వింత ఆకారం చూసేందుకు జనం క్యూ!

థాయిలాండ్‌లో జన్మించిన ఓ వింత ఆకారం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. థాయిలాండ్‌లోని మారుమూల గ్రామంలో జన్మించిన ఆ వింత ఆకారాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. థాయిలాండ్‌లోని ఓ గ్రామంలో గేదెకు ఓ వింత ఆకారంలో ఉన్న రూపం పుట్టింది. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపంలో ఉన్నా, శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. అయితే ఇది సంకర జాతి…

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన హీరో శివరాజ్ కుమార్‌

ప్రముఖ కన్నడ హీరో, దివంగత రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ని బెంగుళూరులోని విఠల్ మాల్యా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు వెంటనే ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ నిర్వహించారు. దాంతో ధమనుల్లో రెండు బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో ఆయనకు యాంజియోప్లాస్టీ గానీ, ఓపెన్ హార్ట్ సర్జరీగానీ చేసే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం ఉదయం జిమ్‌ చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలారు. ఈ విషయాన్ని…

పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి : పోచారం

తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని, పక్క రాష్ట్రంలో వారి పార్టీయే అధికారంలో ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రుణ మాఫీ పేరుతో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే యాభై శాతం రుణాలను చెల్లించామన్నారు. మిగిలిన యాభై శాతం రుణాలతో రైతులకు సంబంధం లేదని, బ్యాంకు అధికారులు రైతులకు రుణమాఫీ ప్రతాలను…

రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది?: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది అంటే దాని అర్థం ఏమిటని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తన కుమార్తెను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఎవరైనా ఆడ బిడ్డ ఇంటి బయటకు వచ్చి జోలె పడుతోందంటే, దాని అర్థం ఆమె…

‘శ్రీమంతుడు’ సైకిల్ ని సొంతం చేసుకోవాలంటే

మహేష్‌ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’ . మార్నింగ్ షో నుంచే చిత్రం సూపర్ హిట్ టాక్ ని మోసుకుని వచ్చి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ ని అదరకొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి తలుచుకోగానే మరో విషయం గుర్తుకు వస్తుంది. అది ఈ చిత్రంలో మహేష్ ఉపయోగించిన సైకిల్. 350,000 విలువ చేసే Cannondale Scalpel Carbon 3 cycle . ఈ సైకిల్ ని మీరు…

ఐశ్వర్యారాయ్ తాజా చిత్రం తెలుగులో డబ్బింగ్

చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా’ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ లో బిజీగా ఉంటోంది. ఇందులో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఐష్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో లాయిర్ అనురాధ వర్మ అనే టైటిల్ తో డబ్బింగ్ చేసారు. కెమెరాకి…

దసరా బరి నుండి తప్పుకున్న ‘అఖిల్’

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘అఖిల్’ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 22న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున, దర్శకుడు వినాయక్ ఈ సినిమాను దసరా బరిలో కాకుండా…. తర్వాత విడుదల చేయాలని…

పూరి జగన్నాథ్ సినిమాకు నటి రేవతి దర్శకత్వం

సౌతిండియాలో ప్రముఖ నటీమణుల్లో రేవతి ఒకరు. త్వరలో ఆమె ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాను ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. నటిగా రేవతి తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, కన్నడలో అనేక చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ఆమె ఇప్పటి వరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002లో ఆమె దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లిస్ మూవీ ‘Mitr, My Friend’ సినిమాకు…